కృష్ణా నది ఒడ్డున గుప్తనిధుల తవ్వకాల కలకలం?


 పెంట్లవెల్లి: నాగర్‌కర్నూల్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల సంఘటన కలకలం రేపింది. పెంట్లవెల్లి మండలం జటప్రోలు సమీపంలోని కృష్ణా నదిలో నీటి మట్టం పూర్తిగా తగ్గడంతో గుప్త నిధుల కోసం తవకాలు జరిగాయి. ఆ గ్రామస్తుల సమాచారం మేరకు జటప్రోలు సంస్థానానికి చెందిన సురభి రాజులు ఆవాసం ఉన్న పాత జటప్రోలు గ్రామం సమీపంలో క్యాషియర్ తువ్వ వద్ద సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలోనీ భూమిని ఆశార ముబారక్ దేవుని మాన్యం మజీద్ కమిటీకి ఇచ్చారు. గత 45 ఏళ్ల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఈ ప్రాంతమంతా నీటితో మునిగి ఉంటుంది. ఫిబ్రవరి మార్చి నెలలో నది జలాలు తగ్గుముఖం పడటంతో భూములు బయట పడుతున్నాయి. నీటిలో నుంచి బయటపడిన భూముల్లో రబీ సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న రైతులు మజీద్ కమిటీతో మాట్లాడుకొని కౌలుకు తీసుకుంటున్నారు. ఇది సాంప్రదాయం అనవాయితీగా నడుస్తుంది. 

ఈ స్థలానికి కూతవేటు దూరంలో..

దీంతో రైతులు సీజన్ వారిగా రకరకాలుగా ఆరుతడి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇట్టి భూములను నది తీరంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన రైతులు కౌలుకు తీసుకొని నువ్వుల పంట సాగు చేశారు. బుధవారం రాత్రి దేవుని మాన్యం భూముల్లో గుర్తు తెలియని దుండగులు గుట్ట నిధులు ఉన్నాయన్న నమ్మకంతో జేసీబీ సాయంతో పంట పొలం మధ్యలో గొయ్యి తీసి క్షుద్రపూజలు చేసినట్లు అనవాలను గ్రామస్తులు గుర్తించారు. ఈ గొయ్యిలో అగర్ బత్తీలు పెట్టి, క్షుద్రపూజలు చేసి గుప్త నిధులను దుండగులు తీసుకెళ్లినట్లు జటప్రోలు గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలానికి కూతవేటు దూరంలో సురభి రాజుల కోటబురుజులు, కోట ప్రాకారాలు శిథిలాలు సైతం ఉన్నాయి. ఈ తవ్వకాలలో పెద్ద ఎత్తున దుండగులకు గుప్త ధనం లభించి ఉండవచ్చనే చర్చ గ్రామంలో చర్చించుకుంటున్నారు. దీంతో జటప్రోలు గ్రామంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం రేపింది. ఈ సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow