10 సెకన్లు 30 బుల్లెట్లు.. ఇంటి బయటే యువకుడి దారుణ హత్య..


 

ఓ యువకుడు ఇంటి బయటే దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు తుపాకితో విచక్షణా రహితంగా యువకుడిపై కాల్పులు జరిపి చంపేశారు. 10 సెకన్లలో 30 బుల్లెట్లు కాల్చి యువకుడి ప్రాణాలు తీశారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఝజ్జర్ జిల్లా, సుబానా గ్రామానికి చెందిన హితేశ్ అలియాస్ గోలుపై గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదర గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడిపై నలుగురు వ్యక్తులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. 10 సెకన్లలో ఏకంగా 30 బుల్లెట్లు కాల్చారు. దీంతో హితేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. హితేశ్ ఇంటి బయట పార్క్ చేసిన కారులోకి వెళ్లి కూర్చున్నాడు. అతడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంతలో ఓ నల్ల కారు వేగంగా హితేశ్ కారు దగ్గరకు దూసుకువచ్చింది. కారులోంచి మొదట ఇద్దరు వ్యక్తులు బయటకు దిగారు. తుపాకులతో హితేశ్‌పై కాల్పులు జరపటం మొదలెట్టారు.


కొద్దిసేపటి తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కూడా కాల్పులు మొదలెట్టారు. హితేశ్‌పై నలుగురు బుల్లెట్ల వర్షం కురిపించారు. హితేశ్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి భయపడిపారిపోయాడు. హితేశ్ చనిపోయాడని ధ్రువీకరించుకున్నాక నలుగురు వ్యక్తులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, ఈ సంఘటన హర్యానాలో పెను దుమారం రేపుతోంది.

In a shocking incident that created panic among locals, a young man was brutally murdered after unidentified assailants opened fire outside his residence. According to eyewitnesses, the attackers fired nearly 30 bullets within just 10 seconds, leaving the victim dead on the spot.

The incident reportedly took place late at night when the youth stepped outside his house. Armed men arrived suddenly and launched a rapid gun attack before fleeing the area immediately after the shooting.

Residents in the neighborhood were terrified by the sound of continuous gunfire. Family members rushed out after hearing the shots, only to find the victim lying in a pool of blood.

Police reached the spot soon after receiving information and shifted the body for postmortem examination. A case has been registered, and special teams have been formed to identify and arrest the accused.

Authorities suspect old rivalries or personal enmity could be the reason behind the murder, though the exact motive is yet to be confirmed. CCTV footage from nearby areas is being examined as part of the investigation.

The brutal killing has sparked fear and tension in the locality, with residents demanding strict action against the culprits.

Hashtags:


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow