Hyderabad DCP Transfers: పోలీసు శాఖలో మరో కీలక పరిణామం.. భారీగా డీసీపీల బదీలీ


 Hyderabad DCP Transfers: హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. సిటీలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న డీసీపీలను విస్తృత స్థాయిలో బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేవెళ్ల డీసీపీ గా యోగేష్ గౌతం, కూకట్ పల్లి జోన్ డీసీపీ రీతి రాజ్, శేర్లింగం పల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్,



బేగం పెట్ జోన్ డీసీపీ రక్షితా కే మూర్తి, రాజేంద్రనగర్ శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీ గా సురేష్, సిద్దిపేట సీపీ గా రష్మి పెరుమాళ్, హైదరాబాద్ SB జాయింట్ cp గా విజయ్ కుమార్ ను నియమించారు.
తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)లో పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జోన్లకు పలువురు డీసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతం, కూకట్‌పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట డీసీపీగా రక్షితా మూర్తి, రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ జోన్ డీసీపీగా సురేశ్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్ నియమితులయ్యారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow