పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష : ఎస్పీ జానకి


 

మైనర్ బాలిక పై లైంగిక దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.

మైనర్ బాలిక పై లైంగిక దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే బాధిత బాలిక కు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం స్పెషల్ సెషన్ జడ్జి తమన్ రాజ రాజేశ్వరీ బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన చిట్లిపల్లి సత్తయ్య(తండ్రి రాములు) 47 సంవత్సరాల వయసు, 2023 మే 23 న గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న అప్పటి భూత్పూర్ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్ దాఖలు చేశారని ఆమె తెలిపారు. ప్రస్తుత భూత్పూర్ సీఐ గా ఉన్న రామకృష్ణ పర్యవేక్షణలో కోర్టు లైజన్ అధికారి చంద్రశేఖర్(పిసీ-31), పిసీ అరవింద్, ఏఎస్ఐ బాలకృష్ణ లు సాక్షులను కోర్టులో పరచగా నేరం రుజువు కావడంతో నిందితుడికి కఠిన శిక్ష పడిందని ఎస్పీ జానకి వివరించారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడితే చట్టం నుండి తప్పించుకోలేరని ఆమె హెచ్చరించారు. ఈ కేసు విజయవంతంగా ముగియడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow