
Energy Lockdown: ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇదే ట్రెండింగ్.. ప్రపంచాన్ని వణికిస్తోంది!
Energy Lockdown: భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రీమియం ఇంధనాల ధరలు పెరిగినట్లు సమాచారం. ఇంధనం..
Energy Lockdown: ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాలపై దాడులు వంటి పరిణామాల కారణంగా ఆయిల్, గ్యాస్ సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిందని అంటున్నారు. దీనితో భారత్‌లో కూడా ఎల్‌పీజీ కొరత, ఆపై పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. కరోనా మహమ్మారి సమయంలో ఉన్నట్లుగా పరిస్థితులు మారవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో “ఎనర్జీ లాక్‌డౌన్” అనే కొత్త పదం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.