విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.
సోషల్ మీడియా లో వైరల్.
ఆలస్యంగా వెలుగులోకి.
చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్.
దిశ మద్దూరు: విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం లోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల కంప్యూటర్ గదిలో కి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగులోకి వచ్చింది.విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంబంధిత అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,సదరు ఉపాధ్యాయుడిని విచారించారు. బాలికపై వెకిలి చేష్టలకు పాల్పడ్డ ఉపాధ్యాయుడిని వెంబడే విధుల నుంచి తొలగించి క టినంగా శిక్షించాలని,లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
