విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు


  • ప్రిన్సిపాల్, వైస్​ ప్రిన్సిపాల్​పై కేసు నమోదు

జడ్చర్ల, వెలుగు: మహబూబ్ నగర్  జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళా వైస్  ప్రిన్సిపాల్  లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి..

 జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని స్కూల్​లో చదువుకుంటుండగా వైస్  ప్రిన్సిపాల్  లైంగిక వేధింపులకు పాల్పడింది. దీనిపై ప్రిన్సిపాల్ కు బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టడంతో పాటు బాలికను భయభ్రాంతులకు గురి చేశారు.

 దీంతో బాధితురాలు జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ కు ఫోన్ లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని జడ్చర్ల పోలీసులను ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేశ్​ తెలిపారు.


జడ్చర్ల : గురుకుల పాఠశాలకు చెందిన మహిళ వైస్ ప్రిన్సిపాల్ పదవతరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించిన సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళ్లితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అదే కళాశాలలో పని చేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న విషయం ఇటీవల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం నిర్వహించిన అవేర్ నెస్ ప్రోగ్రాంలో వెలుగులోకి వచ్చింది. బాడ్ టచ్.. గుడ్ టచ్ తదితర వివరాలను గురించి కళాజాత బృందం అవగాహన కలిగించిన సందర్భంలో పాఠశాలకు చెందిన విద్యార్థినీలు వైస్ ప్రిన్సిపల్.. పదవ తరగతి విద్యార్థిని నీ లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని తెలియజేశారు. బాధిత బాలికను అవేర్ నెస్ ప్రోగ్రాం నిర్వహించిన మహిళా కానిస్టేబుల్ వివరాలు అడగగా.. ప్రతిరోజు రాత్రి సమయంలో మహిళా వైస్ ప్రిన్సిపల్ చేస్తున్న ఆగడాలను కళ్ళకు కట్టినట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. ఈ మేరకు బాలిక తల్లి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్ ను అడగ్గా విషయాన్ని బయటకు చెప్పొద్దు అని , అలా చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించినట్లు బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బాలికను జిల్లా కేంద్రంలోని బాలల సంక్షేమ మండలిలోకి తీసుకువచ్చారు. గురువారం ఈ విషయం పై బాలిక చెప్పిన వివరాలు అన్నింటిని పోలీసులు నమోదు చేసుకున్నారు.గురువారం సాయంత్రం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి మరి నీ వివరాలు సేకరించారు. సిబ్బందిని జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు పిలిపించి మరిన్ని వివరాలను సేకరించారు. వైస్ ప్రిన్సిపాల్ బాలికతో మొదటి నుండి సన్నిహితంగా ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా పోర్న్ వీడియోలు చూపుతూ.. అమ్మ.. నాన్నల ఆట ఆడుకుందాం అంటూ బాలికపై అసభ్యకరమైన రీతిలో వ్యవహరించినట్లు బాధిత బాలికతో పాటు.. పలువురు విద్యార్థినిలు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు పోలీసులు వైస్ ప్రిన్సిపల్ పై ఫోక్సో కేసు నమోదు చేసి గురువారం అరెస్టు చేశారు. విషయము బయటకు పొక్క‌కుండా బాలిక తల్లిదండ్రులను భయపెట్టే విధంగా వ్యవహరించినందుకు పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు దిశ కు తెలిపారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow