తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,284 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా.. 24,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్షను 2024, నవంబర్ 10వ తేదీన నిర్వహించారు. మొత్తం 23,323 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. మెరిట్ లిస్ట్ సిద్ధం చేసి.. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసిన ప్రభుత్వం.. తాజాగా ఫైనల్ మెరిట్ లిస్ట్(ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితా)ను విడుదల చేసింది. కొత్తగా ఎంపికైన అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించనున్నారు.
Tags
Telagana
