Kokapet Land Record: కోకాపేట భూముల వేలంలో కొత్త రికార్డు.. ఎకరం అక్షరాల రూ. 151 కోట్లు


 okapet land Auction in Hyderabad : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట భూములు ఈ-వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ.151.25 కోట్లకు చేరింది. ఫ్లాట్​ నంబర్​ 15, 16లో మొత్తం 9.06 ఎకరాల భూమికి వేలం నిర్వహించారు. 15వ నంబర్​ ప్లాట్​లో ఎకరం రూ.151.25 కోట్లు, 16వ నంబర్​ ప్లాట్​లో ఎకరానికి రూ.147.5 కోట్ల ధర లభించింది. తద్వారా సర్కారు ఖజానాకు రూ.1353 కోట్ల ఆదాయం సమకూరనుంది. 

15వ నంబర్​ ప్లాట్​లో 4.03 ఎకరాల భూమిని లక్ష్మీనారయణ కంపెనీ అనే సంస్థ దక్కించుకోగా, ప్లాట్ నెం 16లోని 5.03 ఎకరాల భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ అనే కంపెనీ సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్​లో హెచ్​ఎండీఏ లేఅవుట్​లో ఫ్లాట్ల భూముల వేలాన్ని ఆన్​లైన్​లో నిర్వహించారు. గతవారం ఇదే లేఅవుట్​లో రూ.137.25 కోట్లుగా ధర పలికిన విషయం తెలిసిందే.

వేలంలో ఉంచిన ప్లాట్ నంబర్ 15 అత్యంత అధిక ధర పలికింది. ఈ ప్లాట్‌లో ఉన్న ఎకరం భూమి రూ. 151.25 కోట్లకు కొనుగోలు జరిగింది. మొత్తం 4.03 ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ అమ్మకం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 609.5 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ప్లాట్‌ను జీహెచ్ఆర్ బ్లాక్స్, లక్ష్మీ ఇన్ ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి.

అదేవిధంగా, ప్లాట్ నంబర్ 16 కూడా భారీ ధర పలికింది. ఇక్కడ ఎకరం ధర రూ. 147.75 కోట్లుగా నిర్ణయమైంది. 5.03 ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 743 కోట్లు లభించాయి. ఈ ప్లాట్‌ను గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ దక్కించుకుంది.

ఈ రెండు ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎండీఏకు మొత్తం రూ. 1352 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం నగరం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కోకాపేట భూములకు ఉన్న డిమాండ్, ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ విలువను మరోసారి చాటి చెప్పింది. భూముల వేలంలో కొత్త రికార్డు నమోదు కావడం రియల్టీ మార్కెట్‌కు శుభసూచకంగా భావించవచ్చు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow