జడ్చర్ల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయని, కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి పోలీసుల గల్లా పట్టే స్థాయికి వచ్చారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పోలీసుల దాడిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ.. కాపాడాల్సిన వారికే రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గాలిలో దీపంలా మారిందని, పోలీసులపై కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీసులకు ఈ ఘటనపై తాము అండగా ఉంటామని లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని నాయకులే గన్ తీసి ప్రజలను బెదిరించిన ఘటనలు మనం చూస్తున్నామని ఆ మధ్య రాష్ట్ర సచివాలయంలోనే గన్నుతో ఇండస్ట్రియల్ లిస్టుని బెదిరించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింన విషయం అందరికి తెలిసిందే గురువారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో భూత్పూర్ కాంగ్రెస్ నాయకులు ఓ యాక్సిడెంట్ కేస్ విషయంలో రాజి కుదిరిచి డబ్బులు ఇప్పించలేదని విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కాలర్ పట్టడంతో పాటు మరో కానిస్టేబుల్ ను తోసెయ్యడంతో పాటు వారిని నివారించడానికి వెళ్లిన ఎస్సై పై కూడా భూత్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్భాషలాడడన్నీ దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించాలని పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు వతస్సు పలకడంతోనే ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి వతస్సు పలుకుతూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒకలాగా ప్రతిపక్ష పార్టీ నాయకులతో ఒకలాగా వ్యవహరించడంతోనే కాంగ్రెస్ నాయకులు పోలీసులు అంటే తమ పార్టీ కార్యకర్తలే అనే విధంగా భావిస్తున్నారని పోలీసులు అంటే విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగా వారిపై దాడులకు దిగుతున్నారని పోలీసులు కూడా ఎవరొచ్చినా సరే ఏ పార్టీ వారితోనైనా సరే చట్టపరంగా నడుచుకోవాలని లక్ష్మారెడ్డి సూచించారు.
Tags
BRS