సైబర్ నేరాలకు పాల్పడుతున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 107 కోట్లను రికవరీ చేశారు. అక్టోబర్ నెలలో సైబర్ నేరాలకు సంబంధించి 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి నగదు కోల్పోయిన బాధితులకు వారి సొమ్మును తిరిగి అప్పజెప్పారు. దాదాపు 66 లక్షల రూపాయలను బాధితులకు అందజేశారు.
అరెస్ట్ అయిన 55 నిందితులపై దేశవ్యాప్తంగా 136 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు 8 రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారని సైబర్ పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
