రేపు సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం


  కొల్లాపూర్ : ఊటిని తలదన్నే విధంగా తెలంగాణలో ప్రముఖ శైవ క్షేతం, పర్యాటక కేంద్రాల్లో ఒకటైన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలానికి తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9గంటలకు 80మంది టూరిస్ట్ లతో కృయిజ్ ప్రారంభమ‌వుతుంది. రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదేశాల మేరకు లాంచీని శ్రీశైలానికి నడపబోతున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ శుక్రవారం తెలిపారు. ఈసారి కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం ఉండడం తో కృష్ణమ్మ అలల పై లాంచీ ప్రయాణానికి ప్రతికూల పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు. ప్రస్తుతం కృష్ణా నది లో జల ప్రవాహం శాంతించడంతో లాంచి ప్రయాణానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. సుదీర్ఘ విరామం తరువాత టూరిజం శాఖ ఆధ్వర్యంలో సోమశిల నుంచి శ్రీశైలానికి కృయిజ్ లాంచీ నడపడానికి అన్నీ ఏర్పాట్లు ఆ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేసినట్లు ఆ శాఖ జిల్లా అధికారి కల్వరాల నరసింహ వివరించారు. 

మరిచిపోలేని అనుభూతి..!

సోమశిల నుంచి శ్రీశైలం వరకు గలగలా పారుతున్న కృష్ణమ్మ ఒడిలో లాంచీలో ఆరు గంటల ప్రయాణం పర్యాటకులు జీవితం లో ఎన్నాడు లేని అనుభూతిని పొందనున్నారు. సోమశిల వద్ద నదిలో లాంచీని ఎక్కిన టూరిస్టులు ..నదికి ఇరువైపులా ఎటు చూసినా ఎత్తయినా పచ్చని కొండలు.. ప్రకృతి రామణీయ దృశ్యాలు. ఆకాశాన్ని తాకుతున్నట్లు పెరిగిన మహా భారీ వృక్షాలు,గలగలా పారే జలపాతాలు, కిచకిచమంటూ విహరించే పక్షుల కిలకీలరావాలు, కొండ కోనల్లో సందడి చేసే వన్య ప్రాణులు, దట్టమైన అడవుల్లో కృష్ణ నదికి ఇరువైపులా తీరంలో మత్స్యకారుల గుడారాలు. ఇవన్నీ మన తెలంగాణలోని నల్లమల అడవులు, అభ యారణ్యల్లో దాగి ఉన్న ప్రకృతి వింతలను, అద్భుతాలను పర్యాటకులు వీక్షించేలా తెలంగాణ ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది.

ప్యాకేజీల వివరాలు :

సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్యాకేజిల వివరాలు ఇలా ఉన్నాయి.సుమారు 120 మంది టూరిస్టులు ప్రయాణించే డబుల్ డెక్కర్ లాంచీలో పెద్దలకు రూ, 3వేలు, చిన్న పిల్లలకు రూ, 2400లు,ధరలను నిర్ణయిం చారు.ఏసీ లాంచీ ప్రయాణా నికి సంబంధించి వన్ వే ప్రయాణంలో పెద్ద లకు రూ, 2వేలు, పిల్లలకు రూ, 1600లు.రానుపోను ప్రయాణనికి పెద్దలకు రూ,3వేలు, పిల్లలకు రూ, 2400లు ధరలు నిర్ణయించారు. ఆన్ లైన్ బుకింగ్ కు సంబంధించి తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో సంప్రదించాలని టూరిజం అధికారులు తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow