ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్


 మిస్టర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని అభిమానులకు పండగ లాంటి న్యూస్. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎంఎస్ ధోనీ ఆడుతారా లేదా అనే సందేహాలకు చెక్ పడింది. కోట్లాదిమంది ఫ్యాన్స్ తో క్రికెట్ రారాజుగా వెలిగిన ధోని... చివరి ఐపీఎల్ సీజన్ లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అప్పటినుంచి వచ్చే సీజన్ లో ఆడరనే వార్తలు షికార్లు చేశాయి. అయితే అందరి ఊహలు తలకిందులు చేస్తూ.. తరువాతి సీజన్ కు సిద్ధం అవుతున్నట్టు ప్రకటన వచ్చేసింది. న శరీరం సహకరిస్తే మరో సీజన్‌ ఆడుతానని ఇదివరకే ప్రకటించిన ధోనీ.. మరో సీజన్లో కూడా పసుపు జెర్సీతో స్టేడియాలను దద్దరిల్లేలా చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ధోనీ రానున్న 19వ ఐపీఎల్ సీజన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ క్రిక్‌బజ్‌తో పంచుకున్నాడు. దీంతో ధోని అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow