హైదరాబాద్, నవంబర్ 7: మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హ్యాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు ఒరిస్సాకు చెందిన సోనియా అనే వ్యక్తి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. విశ్వనీయ సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ టీం, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సోనియా ప్రధాన సూత్రధారిగా తేల్చారు.
సోనియాకు సహాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు లక్ష్మి, దుర్గ ప్రసాద్, దుర్గలను సైతం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ వారి వద్ద నుండి 3 లక్షల విలువ చేసే 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మాదాపూర్ ఎస్ఓటీ టీం మియాపూర్ పోలీసులకు కేసు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజుల క్రితం తాను అద్దె ఉంటున్న ఇంట్లోనే డ్రగ్స్ పెట్టుకొని సరఫరా చేస్తున్న జాన్‌పాల్ అనే డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించాడు. ఇలా వచ్చిన డబ్బును స్నేహితులకు ఇస్తూ, తాను డ్రగ్స్‌ను ఉచితంగా వినియోగిస్తున్నాడు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఈ వ్యవహారం గుట్టు రట్టుచేశారు. నిందితుడి నుంచి రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడి నివాసంలో తనిఖీలు చేపట్టి రూ.3 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. జాన్‌పాల్‌ను అరెస్టు చేసి, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.