Nagarjuna Sagar: అలలపై అలా.. సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ రీ స్టార్ట్
కృష్ణానది ఒడిలో లాహిరి లాహిరి అంటూ దట్టమైన నల్లమల అటవీ అందాల మధ్య లాంచీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ.. గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య సాగే నార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ ఈనెల 22నుంచి ప్రారంభించేందుకు టీజీటిడీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శనివారం ఉదయం 10:30 గంటలకు నాగార్జున సాగర్ నుండి లాంచీ బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు పాతాళగంగకు చేరుకుంది. మరుసటి రోజు పర్యాటకులు, భక్తులు మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత లాంచీ నాగార్జునసాగర్‌కు తిరిగి బయలుదేరి వెళ్తుంది. అయితే శ్రీశైలంలో రూమ్, ట్రాన్స్ పోర్ట్ వంటి వాటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ తెలిపింది. ఈనెల 22 నుంచి ప్రతి శనివారము టికెట్ల బుకింగ్ ఆధారంగా సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని కొనసాగిస్తామని సంస్థ తెలిపింది. సోమవారం నుండి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.
ఆన్ లైన్ టికెట్ల కోసం www.tgtdc.in వెబ్ సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ :9848540371, 9848125720, అలాగే నాగార్జునసాగర్ లాంచీ యూనిట్ :7997951023 ఫోను నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.