మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని టూ టవున్ పరిధిలోని వివిధ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడ్డ మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ అండ్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని, వారితో పాటు వారి తల్లిదండ్రులను టూ టవున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నడిపిన 35 ద్విచక్ర వాహనాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, మైనర్లకు వాహనాలను అప్పగించకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇది మొదటిసారిగా హెచ్చరిస్తూ, ఫైన్ విధించి ముగిస్తున్నట్లు, మరోసారి ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేసి, లైసెన్స్ రద్దు చేసే చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టూ టవున్ సీఐ ఇజాజొద్ధీన్ పాల్గొన్నారు.
Tags
mahabubnagar