ఇదెక్కడి చిత్రం సిగ్గు సిగ్గు.. ఏకంగా సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన ఎస్సై!


 పోలీసులు దారి తప్పుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కనిపించని నాలుగో సింహాలా కాపు కాయాల్సిన వారే కంచె చేను మేసిన చందంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న మహిళతో ఓ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించి కటకటకటాలపాలైన ఘటన మరువక ముందే నగరం నడిబొడ్డున మరో సంచలన ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పే‌ట్ (Amberpet) పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ గన్ మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఓ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారం (Gold)తో పాటు సదరు ఎస్సై గన్ మిస్ అయినట్లుగా తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఎస్సై ఎలాంటి సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది. అయితే, బంగారంతో పాటు తుపాకీని కూడా ఓ పాన్ బ్రోకర్ షాపు (Pawn Broker Shop)లో ఎస్సై అమ్మినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతోనే విధి నిర్వహణలో తన వెంట ఉండే గన్‌ను అమ్మేసినట్లుగా సమచారం. ఈ మేరకు ఎస్సై‌ భానుప్రకాశ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow