రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం : కెమికల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు


 మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. యాసిడ్ ట్యాంకర్ నుంచి పొగలు వచ్చాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పొగలను అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు.

 జగన్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే పబ్లిక్ బిక్కుబిక్కుమంటున్నారు. జగన్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెప్పుకొచ్చారు. 

వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు కూడా హైదరాబాద్లో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే ఓవర్​ హీట్ కారణంగా బస్సు టైర్లలో నుంచి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. మరో బస్సు అరేంజ్ చేస్తామని చెప్పడంతో 26 మంది ప్రయాణికులు తీవ్ర చలిలో రోడ్డు పైనే వేచివున్నారు. గంటల తరబడి చలిలో ఇబ్బంది పడినా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

44వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ లోని కెమికల్ మంటలు అంటుకునేది కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు నుండి హైదరాబాద్ కు 26 మంది ప్రయాణికులతో బయలు దేరింది జగన్ ట్రావెల్ బస్సు. ఈ క్రమంలోనే జడ్చర్ల పట్టణంకి చేరుకోగానే మాచారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ముందుగా వెళుతున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను వెనక నుండి జగన్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్ కెమికల్ లీకై రోడ్ మీద పడడంతో పొగలు కముకున్నాయి

వెంటనే తేరుకున్న బస్సు డ్రైవర్ బస్సులో ప్రయాణికులను అప్రమత్తం చేయగా అందరూ ఎగ్జిట్ డోర్ల ద్వారా కిందికి దిగారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కెమికల్ లీకేజీ ద్వారా వస్తున్న పొగలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలిసిన పట్టణ సీఐ కమలాకర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువైపులా ట్రాఫిక్ ను నిలిపివేసి బస్సు ప్రమాద బాధితులను మరో వాహనంలో హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనతో 44వ జాతీయ రహదారి పై ఇరువైపులా సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల వరుస జరుగుతున్న బస్సు ప్రమాదాలతో హడలెత్తిన ప్రజలు మరోసారి జడ్చర్లలో బస్సు ప్రమాదం జరిగి బస్సులో మొగల్ వస్తున్నాడంతో మరో ఎంత ఘోర ప్రమాదం జరిగిందోనని ఒకింత తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అటు పోలీస్ అధికారులతో పాటు పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow