ఉండవెల్లి : 33 అడుగుల భారీ శివలింగం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ వైపు తరలి వెళుతుండడంతో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం నుంచి పాట్నా రాష్ట్రంలో 33 అడుగుల భారీ రాతి శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నారు. మూడు రోజుల కిందట బయలుదేరిన ఈ వాహనం శనివారం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర డ్రైవర్ విశ్రాంతి కోసం వాహనాన్ని నిలిపి ఉంచారు. దీంతో భారీ రాతి శివలింగాన్ని చూసిన ప్రజలు సెల్ఫీల కోసం ఎగబడుతూ ఫోటోలు తీసుకున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి పై సందడి నెలకొన్నది.
Tags
Telagana