9th క్లాస్ అబ్బాయి - ఇంటర్ అమ్మాయి.. కట్ చేస్తే బిడ్డకు జననం


 వనపర్తి రూరల్: వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. వనపర్తి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి అబ్బాయి.. ఇంటర్ చదువుతున్న అమ్మాయి ప్రేమించుకున్నారు. పలుమార్లు శారీరకంగా కలిశారు. ఈ నేపథ్యంలో బాలిక ప్రెగ్నెన్సీ అయింది. విషయం గుర్తించిన బాలిక తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరూ మైనర్లు కావడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14న బాలిక శిశువుకు జన్మనిచ్చింది. గ్రామంలో పంచాయితీ పెడితే మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు.. అని బాలుడి తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. ఇటు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ.. చర్యలు తీసుకోవడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow