.
సెప్టెంబర్ 17 ఫక్తు పొలిటికల్ డేగా మారిపోయింది. రెండు శతాబ్దాల నిజాం పాలనకు తెరపడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సెప్టెంబర్ 17పై రాజకీయ దుమారం రగులుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో వేడుకలు నిర్వహిస్తూ… పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇంతకీ ఏ పార్టీ విధానం ఏంటి..?
LIVE NEWS & UPDATES
ఇంధనశాఖపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష
ఇంధనశాఖపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను సీఎం రేవంత్‌కు వివరించిన అధికారులు. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని సీఎం సూచించారు. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త డిస్కం ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు సీఎం ఆదేశించారు.
సమైక్యత దినోత్సవంగా బీఆర్‌ఎస్
మరోవైపు సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది బీఆర్‌ఎస్. ఇటు ఎంఐఎం కూడా బీఆర్‌ఎస్ బాటలోనే సెప్టెంబర్ 17న ప్రతి ఏడాది సమైక్యతా దినాలు నిర్వహిస్తోం వస్తుంది.
గాంధీభవన్‌లో విలీనదినం వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగా గాంధీభవన్‌లో విలీనదినం వేడుకలు జరపనుంది. జిల్లా కేంద్రాల్లో కూడా విలీనదినం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విలీన దినోత్సవంపై ప్రజలను బీజేపీ కన్ఫ్యూజ్ చేస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ మండిపడ్డారు.
సెప్టెంబర్ 17 రాజకీయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఎంఐఎం పార్టీ చెప్పినట్టు వింటున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. గత పదేళ్లు మజ్లిస్‌కు భయపడి సెప్టెంబర్ 17ను బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా విమోచన దినోత్సవం జరపలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసదుద్దీన్‌కు జడిసి సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడం లేదన్నారు బీజేపీ తె
లంగాణ చీఫ్ రాంచందర్ రావు.
హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకరు విలీనం అంటే.. ఇంకొకరు విమోచనం.. మరొకరు సమైక్యత దినం అంటూ కార్యక్రమాలకు రెడీ అయ్యారు. ఇది ముమ్మాటీకి తెలంగాణ విమోచన దినోత్సవమే అంటూ వేడుకలకు రెడీ అయింది బీజేపీ. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండేళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగా గాంధీభవన్‌లో విలీనదినం వేడుకలు జరపనుంది. జిల్లా కేంద్రాల్లో కూడా విలీనదినం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది బీఆర్‌ఎస్. ఇటు ఎంఐఎం కూడా బీఆర్‌ఎస్ బాటలోనే సెప్టెంబర్ 17న ప్రతి ఏడాది సమైక్యతా దినాలు నిర్వహిస్తోం వస్తుంది.