జడ్చర్ల, సెప్టెంబర్ 22: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో ఐబి బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, విజయ్ కుమార్ ప్రియాంక దంపతులు, గుండు చంద్రశేఖర్, యాదగిరి, భక్తులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Jadcherla
