జిల్లా ఆసుపత్రిలో.... మళ్లీ విచారణ*

 💥 *


💥 *3 గంటలపాటు జిల్లా జడ్జి సమగ్ర విచారణ* 

💥 *నెల రోజుల్లోనే... మూడుసార్లు విచారణ*

💥 *వరుస వివాదాల్లో జిల్లా ఆసుపత్రి*

💥 *సీసీ కెమెరాలు, వరుస చోరీలు, కిడ్నాప్ లు, భద్రతా వైఫల్యాలపై ఆరా*

💥 *పోస్టుమార్టం లేకుండానే మృతదేహాల తరలింపు* 

💥 *ఎన్నిసార్లు విచారించిన మారని ఆసుపత్రి సిబ్బంది, ఎస్పీఎఫ్ పని తీరు*

💥 *సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్*


       వరుస చోరీలు... కిడ్నాప్ లు.... పోస్టుమార్టం లేకుండానే మృతదేహాల తరలింపు....ఆపై మృతుడి బంధువులను సివిల్ పోలీసులు వాళ్ల ఇంటికి వెళ్లి మరి బతిమాలి ఆసుపత్రికి తీసుకువచ్చి... తిరిగి పోస్టుమార్టం చేసిన సంఘటనలు కోకొల్లలు....చివరికి డ్యూటీ డాక్టర్ల డబ్బులు సైతం కొల్లగొట్టిన సంఘటనలతో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరస వివాదాలకు నిలయంగా మారింది. ఈ వరస సంఘటనల నేపథ్యంలోనే *సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్* ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గత నెల రోజుల్లోనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడుసార్లు విచారణ కొనసాగడం గమనార్హం.ఈ మొత్తం వ్యవహారంపై రెండు పర్యాయాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ డి. ఇందిరా విచారణ చేపట్టగా, ఒకసారి ఎస్పీఎఫ్ భద్రతా విభాగానికి చెందిన ఉన్నతాధికారి రత్నాకర్ రావు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చి రహస్యంగా విచారణ జరపడం గమనారం. 


💥 *3 గంటలపాటు జిల్లా జడ్జి సమగ్ర విచారణ* 


          జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ డి. ఇందిరా సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుండి మధ్యాహ్నం నాలుగున్నర గంటల వరకు దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమగ్ర విచారణ చేశారు. ఆసుపత్రిలోని ఎంసిఎచ్ తో పాటు పలు వార్డులని తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.  


👉 *ఎస్పీఎఫ్, సాయి సెక్యూరిటీ సిబ్బందితో స్టేట్మెంట్ రికార్డ్*


         ఇదిలా ఉంటే జిల్లా ఆసుపత్రిలో గత కొంతకాలంగా భద్రత వైఫల్యాల నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలోని ఎస్పీఎఫ్ ఏఎస్ఐ ప్రసాద్ తో పాటు సాయి సెక్యూరిటీ సిబ్బంది ఇంచార్జ్ నుండి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ డి. ఇందిరా సోమవారం మధ్యాహ్నం స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు శిరీష, జరీనాలతో పాటు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


👉 *ఎన్నిసార్లు విచారించిన మారని పనితీరు*


        ఇదిలా ఉంటే ఎన్నిసార్లు విచారణలు జరిగిన ఆసుపత్రి సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది పనితీరులో మార్పు రావడంలేదని, వరుస దొంగతనాలకు, కిడ్నాప్లకు, పోస్టుమార్టం లేకుండా మృతదేహాలు తరలింపు అంశాలపై ఆసుపత్రి సిబ్బంది, ఎస్పీఎఫ్ పోలీసుల నిర్లక్ష్యమే కారణమని *సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్* విమర్శించారు. ఈ సంఘటనల అన్నింటిపై జిల్లా న్యాయమూర్తితో పాటు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow