డి ఐ జి ఎల్ ఎస్ చౌహన్ ఆకస్మిక తనిఖీలు



*మహబూబ్‌నగర్ జిల్లాలో డిఐజి వార్షిక తనిఖీ – రికార్డుల పరిశీలన, పెండింగ్ కేసుల వేగవంతం పై పలు సూచనలు చేశారు *

*DIG ఎల్.ఎస్.చౌహన్, ఐపీఎస్ .*


జోగులాంబ జోన్ – VII డిఐజి ఎల్. ఎస్. చౌహన్, ఐపీఎస్ సోమవారం రోజు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్, మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ మరియు డిఎస్పి కార్యాలయంలను వార్షిక తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా డిఐజి అన్ని రికార్డులను సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేయాలని, ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి ప్రజలకు న్యాయం అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.


డిఐజి సిబ్బందితో సమావేశమై శ్రద్ధ, క్రమశిక్షణ మరియు పారదర్శకతతో పనులు నిర్వహించాలి అని సూచించారు. పోలీస్ స్టేషన్లలో రికార్డులు, సౌకర్యాలు, పరిపాలన మరియు శాంతి భద్రతా కార్యక్రమాలను సమీక్షించారు.


ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, డిఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సిఐ గాంధీ నాయక్, మహమ్మదాబాద్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow