జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- ఆలూరు లో ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, పద్యపఠనం మరియు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు బహుకరించారు.
తెలుగు భాష ప్రాముఖ్యతను సాటి చెప్పేలా విద్యార్థులతో వివిధ రకాల కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఆంగ్ల మాధ్యమం మోజులో పడి తల్లిదండ్రులు తెలుగును చిన్నచూపు చూస్తున్నారని మాతృభాష అంటే అమ్మ భాష అని అర్థం.
తెలుగులోని పదాలు ఉచ్చరించడం వల్ల శరీరంలోని ప్రతిభాగం ఎక్ససైజ్ చేసిన అంటే వ్యాయామం చేసినట్లు అవుతుంది అది ఆంగ్ల భాషతో నాలుక పెదాలు తప్ప వేరే అవయవాలు ఏవి కదలవు అని అన్నారు. ఇంట్లో విధిగా తెలుగు భాష ఉచ్చరణ చేసి తమ పిల్లలకు తెలుగు భాషలో ముందుకు వెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి అహ్మద్ షరీఫ్ ప్ర. ఉ. అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి “ సాకేత్ ప్రవీణ్ , శ్రీ యుగంధర్ విశ్రాంత G H M రావడం జరిగింది. సాకేత్ ప్రవీణ్ మాట్లాడుతూ “అ, ఆ, ఇ , ఈ అని చెప్పుచు, అ అంటే అమ్మ (ధర్మం) ఆ అంటే ఆవు (సంపద) ఇ అంటే ఇల్లు (నడత) ఈ అంటే ఈశ్వరుడు (దేవుడు) ఈ నాలుగు సరిగ్గా నేర్చుకుంటే జీవితం అంతా సుఖంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమం అబ్దుల్ అలీమ్ S A తెలుగు అధ్వర్యంలో జరిగింది. హరిహరన్ ,సంధ్య ,హైమావతి ,మంజుల, నిర్మల మెుదలగు వారు పాల్గొన్నారు.
