భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

Bharath New Vice President : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేదే గెలుపు, భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌


  భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఇక భారతదేశానికి కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ కాబోతున్నారు. ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన బి.సుదర్శన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(మంగళవారం) భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఈ సాయంత్రం 5 గంటలకు ముగియగా, ఓట్ల లెక్కింపు అనంతరం రాత్రి 7:30 గంటలకు ఫలితాలు వెలువరించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.

ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 97 శాతం పోలింగ్‌ నమోదైంది. 768 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 13 మంది మినహా మిగతా ఎంపీలంతా ఓటు వేశారు. ఇలా ఉండగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార NDA కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్‌, ఇండీ కూటమి నుంచి బి.సుదర్శన్‌రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. హోరా హోరీగా సాగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరులో అంతిమ విజయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నే వరించింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow