పార్టీ మారిన ఎమ్మెల్యేలు మగ ఆడ కానీ అటు ఇటు కాని ఎమ్మెల్యేలు

 పార్టీ మారిన ఎమ్మెల్యేలు మగ ఆడ కానీ అటు ఇటు కాని ఎమ్మెల్యేలు

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

JCLNEWSTVజడ్చర్ల :


మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల:

కేటీఆర్ ప్రెస్ మీట్..

రేవంత్ రెడ్డి 21 నెలల్లో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారు.


ఆయన ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ,, అప్పుడున్న టీడీపీ లు పాలమూరు వెనకబాటు తనని కారణం..

మరి పాలమూరు బిడ్డ సీఎం గా అయితే మా బతుకు మారుతుందని 12 సీట్లు ఇచ్చారు..

కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి నీ 90 శాతం పూర్తి చేశారు..

ఇపుడు రేవంత్ పది శాతం పనులు పూర్తి చేస్తే నీళ్లు పడుతాయి.. కాని కేసీఆర్ కు పేరు వస్తుందని పడావు పెట్టాడు..

హడావుడి గా కొడంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 4000 కోట్లతో కొడంగల్ నారాయణ పేట ఎత్తిపోతల పథకం తెచ్చారు. మనసులో ఏదో ఆలోచన పెట్టుకుని తెచ్చారు.. అక్కడ NGT అడ్డుపడింది.. రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారు.

పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్టుకు వారి మామ జైపాల్ రెడ్డి పెట్టుకున్నారు. ఆయన ఒక్క రూపాయి ఇవ్వలేదు.


కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి అంటారు.. అక్కడ 93 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతది.. వారి మామ పద్మారెడ్డి క్లియర్ గా చెప్పారు.. 93 వేల కోట్ల రూపాయల బడ్జెట్తో చేశారని..

మా నాయకులను సమాయత్తం చేసి.. జిల్లాలో జనలదగ్గరకు పోతాం.. పాలమూరు జిల్లాలో మా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు.

ఒక టీవీ ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ క్లియర్ గా ఆ పది మంది మా పార్టీలో చేరారని చెప్పారు..

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్తితి.

బీ ఆర్ ఎస్ లో ఉంటే ఎందుకు మాతో కలవడం లేదు.. మరి జూపల్లి, పొంగులేటి కేసీఆర్ గారిని తిడుతుంటే మరి మా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని..

PCC అధ్యక్షుడు చెప్పిన మాటలు కోర్టులో పెడతాం

పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారు తాము పార్టీ మారామని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదని విమర్శించారు. పుంలింగం, స్త్రీ లింగం రెండు లింగాలు ఉంటాయి. కానీ సీఎం భాషలో చెప్పాలంటే పార్టీ మారిన ఎమ్మెల్యే తాము ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించినందుకు మా కార్యకర్తలు బాధ పడుతున్నారన్నారన్నారు. ఇవాళ జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు. పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారని ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పీసీసీ చీఫ్ నేరాంగీకారం చేశాక ఈ విషయంలో ఇంకా చర్చ దేనికి? ఆ పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి స్పీకర్ కు మోహమాటం దేనికి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మీడియా, కోర్టులతో చిలిపి ఆటలాడి తప్పించుకోవాలనే ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జీవితమంతా రాజకీయాలు చేసిన పెద్దలు, మంత్రులుగా పని చేసిన వారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని మీడియా అడిగితే చెప్పుకోలేని దురవస్థలో పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో చేరానని కడియం శ్రీహరి కూడా చెప్పారు. అందువల్ల వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నందునా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు.


కేసీఆర్ కు పేరు వస్తుందనే దురాలోచన:

కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90శాతం పూర్తి అయ్యాయని మిగతా 10 శాతం పనులకు కూడా భూసేకరణ చేశామని కేటీఆర్ చెప్పారు. ఆ 10 శాతం పనులను పూర్తి చేస్తే కేసీఆర్‌ కు పేరు వస్తుందని, కేసీఆర్ పేరును ప్రజలు మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారనే దురాలోచనతో రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును పడావు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow