కేంద్ర ప్రభుత్వం సామాన్యులను ఆదుకోవడం కోసం ఓ పథకం తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రమాదంలో కానీ లేదా మరే ఇతర కారణాల వల్కుల అయినా సరే ఓ కుటుంబ పెద్ద చనిపోతే, ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ స్కీమ్ తీసుకువచ్చారు. దీని ద్వారా రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్)స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా బాధిత కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం అనగా 2017లో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
పథకం కింద ప్రతి సంవత్సరం గరిష్ఠంగా 7,794 మందికి రూ.20 వేలు సాయం చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. గ్రామ, మండల స్థాయుల్లో అధికారులు దీనిపై తగినంత అవగాహన కల్పించకపోవడం వల్ల అర్హులైననప్పటికీ చాలా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. పథకానికి తగినట్లుగా సరిపడా దరఖాస్తులు లేక..సెర్ప్ వద్ద రూ.60 కోట్ల నిధులు అలాగే ఉన్నాయి.
అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలంటే..
గ్రామాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్న రైతు కూలీలు, అలానే చిన్నా చితకా పనులు చేసుకునే కార్మికులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. చనిపోయిన వారి వయసు 18-60 ఏళ్ల లోపు ఉండాలి.
కుటుంబ పెద్ద అనుకోని కారణం వల్ల లేదా ఏదైనా ప్రమాదం వల్ల మరణిస్తే అతడి కుటుంబ సభ్యులు రెండేళ్ల లోపు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లై చేసుకోవాలంటే కచ్చితంగా మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం.
వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్, ఆధార్, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో కలిసి తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
ఐకేపీ, రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తును విచారించి.. ఆ తర్వాత ఆర్డీఓకు పంపుతారు. అక్కడ నుంచి సెర్ప్ సీఈఓకు పంపిస్తారు.
సెర్ప్ సీఈవోఆమోదం లభిస్తే.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20 వేలు జమవుతాయి.
అయితే దీని గురించి సరైన అవగాహన లేక చాలా జిల్లాల్లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదని అధికారులు తెలిపారు.. జీరో అప్లికేషన్లు వచ్చాయని సమాచారం.
