షాద్ నగర్ లో వేట కొడవళ్లతో ఘర్షణ* *గంతల పృధ్వీ రాజ్ పై దాడి - కత్తిపోట్లు*

 *


 *షాద్ నగర్ పట్టణంలో కత్తులు, కర్రల



తో అలజడి*

 *కుటుంబాల మధ్య తగాదా - హత్యా యత్నానికి కారణం..?*

 *ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పృథ్వీరాజ్* 

 *నేరస్తులను పట్టుకుంటామని సీఐ విజయ్ కుమార్ వెల్లడి* 

ఇరు కుటుంబాల మధ్య చెలరేగిన చిచ్చు.. ఓ వ్యక్తి హత్యాయత్నానికి దారితీసింది. రోడ్డుపై ఇరువర్గాలు కత్తులు పట్టుకొని నరుక్కునేదాకా పరిస్థితి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కుటుంబాల మధ్య తగాదా చిలికి చిలికి గాలి వానలా మారింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కిషన్ పేట రైల్వే గేటు వద్ద జరిగిన ఈ తతంగం స్థానికులు కొందరు వీడియోలు తీసి హలో షాద్ నగర్  మీడియాకు సమాచారం అందజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సీనియర్ నాయకుడు, కాంట్రాక్టర్ గంతల ప్రభు మొదటి భార్య కుమారుడు గంతల పృధ్వీ రాజ్ పై రెండో భార్య కుమారుడు గంతల నందీశ్వర్ కత్తులతో దాడి చేసినట్లు షాద్ నగర్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. ఉదయం తన పిల్లలతో పాల కోసం వెళ్లిన పృథ్వీరాజ్ తిరిగి వస్తుండగా కేశంపేట రైల్వే గేటు వద్ద అటకాయించిన నందీశ్వర్, భరత్ ఇరువురు కలిసి తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్ళతో పృధ్విరాజ్ పై హత్యాయత్నానికి ఒడిగట్టారు. రోడ్డుపై అందరు చూస్తుండగానే ఈ సంఘటన జరగడంతో స్థానికులు మహిళలు ఒక్కసారిగా భీతిలిపోయారు. రోడ్డుపై వేటకుడవలతో ఓవైపు రక్తం కారుతున్న మరోవైపు ఇరు వర్గాల చేతుల్లో కూడా కత్తులు కనిపించడం పట్టణంలో వివాదానికి దారితీసింది. ఒకరినొకరు దూషించుకుంటూ రోడ్డుపై హల్చల్ సృష్టించడంతో ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైన పృథ్వీరాజ్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికుల సహాయంతో మొదట తరలించారు. ఆ తర్వాత అతనికి మెరుగైన చికిత్స జరుగుతుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన నందీశ్వర్, భరత్ ఇరువురిని పోలీసులు పట్టుకొని విచారించాల్సిన అవసరం ఉంది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని సిఐ విజయ్ కుమార్ మీడియా అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు. ఇరు కుటుంబాలలో తలెత్తిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇటీవల నందీశ్వర్ వివాహ విషయంలో కొంత వివాదం జరిగిందని తెలుస్తోంది. వివాహానికి సంబంధించి వారి బంధువులలో నందీశ్వర్ కు గంతల వర్గానికి ఎలాంటి సంబంధం లేదని పెళ్లి చెడగొట్టారని, ఉద్దేశపూర్వకంగా జరగడం వివాహం రద్దు కావడం తదితర పరిణామాలతో ఇరువర్గాల మధ్య కక్ష పెరిగిందని తెలుస్తోంది. తన వివాహం చెడగొట్టారని ఉద్దేశంతో పృథ్వీరాజ్ ను అంతమొందించేందుకు నందీశ్వర్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. అంతకుముందు కూడా కుటుంబాల మధ్య కొంత వివాదం ఏర్పడి ఉంది.. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow