బాలానగర్ పోలీస్ స్టేషను సందర్శించి జిల్లా ఎస్పీ టీ జానకి ఐపిఎస్.*


జిల్లా ఎస్పీ డి. జానకి ఐపీఎస్ బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను ఈరోజు అనగా తేదీ 12.09.2025 సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి, వివిధ విభాగాలలో జరుగుతున్న కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలనీ, స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడే క్రమంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం అందించాలన్నారు.

నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు, బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నేర నియంత్రణ, చట్ట సువ్యవస్థ పరిరక్షణలో ప్రతి ఒక్కరు కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.


అలాగే స్టేషన్ ప్రాంగణం శుభ్రత, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణలో ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. జిల్లా ప్రజలకు న్యాయం అందించే దిశగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలని ఆమె కోరారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow