హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా.. వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు వాతవారణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వర్షాల దృష్ట్యా అధికారులు పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలువులు కూడా ప్రకటించారు. చాల జిల్లాలు జలమయం అయ్యాయి. ఈ మేరకు వరద ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
..

JCL NEWS ఛానల్ ఫాలో అవ్వండి
అయితే.. భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతుంది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్థంబించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయం అవ్వడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తుంది. ఈ మేరకు నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు. ఈ వర్షాలు ఇంకా మూడు రోజులు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. దూరం ప్రయాణం చేసే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే.. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో నిలిచిపోయిన నీరును బయటకు పంపిస్తున్నారు. వర్షాల కారణంగా ఎవరూ అనవసరంగా బయట తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు.