దసరా హాలీడేస్ ఎప్పటినుంచంటే.?

 


Dasara Holidays: ఇది కదా కావాల్సింది.. తెలుగు రాష్ట్రాల్లో దసరా హాలీడేస్ ఎప్పటినుంచంటే.?

కృష్ణాష్టమి పూర్తయింది. ఇక వినాయక చవితి.. రాబోయేది దసరా.. మరి విద్యార్ధులకు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సెలవులు ఎన్ని ఇచ్చారో ఇప్పుడు ఓసారి చూసేద్దాం. సెప్టెంబర్ మూడో వారం నుంచే సెలవులు రానున్నాయి. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో..


తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు పండుగే పండుగ.. ఈసారి దసరా సెలవులు భారీగానే ఉండనున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు స్కూల్స్, పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ఇచ్చారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అటు తెలంగాణలో సెప్టెంబర్ 5న మీలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలీడే ఉంది.

అలాగే ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు డిసెంబర్ 21 నుంచి 28 వరకు క్రిస్మస్ హాలిడేస్ ఉండనున్నాయి. ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్ధులకు భారీగా సెలవులు రానున్నాయి. ఇక ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజుల హాలిడేస్ వచ్చాయి.

Previous Post Next Post

نموذج الاتصال