ఆపరేషన్ సింధూర్’.. 4 జైషే స్థావరాలు ధ్వంసం.. 100 మంది ఉగ్రవాదులు హతం?

ఆపరేషన్ సింధూర్ అంటే..

ఆపరేషన్ సింధూర్‌. ఎందుకీ పేరు? పహల్గామ్‌దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి, ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సింధూర్‌’ అని నామకరణం చేశారు.

 

ఆపరేషన్ సింధూర్ అప్‌డేట్స్..

— మర్కజ్ సుభాన్ అల్లా పేరుతో పిలవబడే జైష్‌ ఎ మొహమ్మద్‌ ప్రధాన స్థావరం పాకిస్తా్‌న్‌లోని పంజాబ్‌ జిల్లా బహవల్పూర్‌లో ఉంది. 2019 పుల్వామా ఉగ్రదాకి పాల్పడిన నిందితులకు ఈ శిబిరంలోనే శిక్షణ ఇచ్చారు.

— మర్కజ్ జైష్‌ ఎ మొహమ్మద్‌ స్థావరంలో జైషే మమ్మద్ చీఫ్‌ మౌలానా మసూద్ అజర్, జైష్‌ ఎ మహ్మద్ అధిపతి ముఫ్తీ అబ్దుల్ రవూఫ్‌ అస్గర్, మౌలానా అమ్మర్ కుటుంబసభ్యుల నివాసాలు కూడా ఉన్నాయి. వీరితో పాటు 600 మందికి పైగా జైష్‌ ఎ మహ్మద్ సభ్యులు ఉంటున్నారు.

— యూకే సహా కొన్ని గల్ఫ్‌, ఆఫ్రికన్ దేశాల నుంచి సేకరించిన నిధులతో పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ జైష్‌ ఎ మమ్మద్‌ స్థావరం మర్కజ్ సుభాన్ అల్లా నిర్మాణం చేపట్టింది. ఇక్కడ 2018 జులై నుంచి జైష్‌ ఎ మహ్మద్‌ సభ్యులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

జైష్-ఎ-మొహమ్మద్ కీలక కేంద్రం నేలమట్టం

– పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఉంది ఈ హెడ్‌క్వార్టర్‌. -15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం ఉంటుంది. – 2019 పుల్వామా దాడికి ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. – మసూద్ అజార్ ఆధీనంలోని ఈ టెర్రర్‌ క్యాంప్‌ను గురిపెట్టి ధ్వంసం చేసింది మన ఆర్మీ. – జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్‌తో కలిసి ఈ శిబిరం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

– మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే టార్గెట్‌గా మిస్సైల్‌ దాడులు – బహావల్‌పూర్‌పై మొదటి దాడి చేసిన భారత్ సైన్యం – బహావల్‌పూర్‌లోనే 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ – బహావల్‌పూర్‌లోని మసూద్‌ అజర్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడి – మసూద్‌ అజార్‌కి సంబంధించిన మదర్సాపై 4 క్షిపణుల దాడి – లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైనా భారత్‌ దాడులు – భారత్‌ మిస్సైల్‌ దాడులతో బెంబేలెత్తిన పాకిస్తాన్‌ – భారత్‌ 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను ప్రయోగించిందన్న పాక్‌ – దాడుల్లో 8 మంది మృతి 33 మందికి గాయాలు- పాక్‌ ఆర్మీ అధికారి

ముగ్గురు భారత పౌరుల దుర్మరణం

భారత్‌ మెరుపుదాడితో రగిలిపోయి బోర్డర్‌లో పాక్‌ కాల్పులకు దిగింది. సరిహద్దు గ్రామాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిగింది. పాక్‌ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరుల దుర్మరణం చెందారు. మన జవాన్ల కాల్పుల్లో పలువురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. తమవైపు జరిగిన నష్టాన్ని బయటకు చెప్పుకోని పాకిస్తాన్‌.

పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ

ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది.  ఈమేరకు అన్ని ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులను పాకిస్తాన్ క్లోజ్‌ చేసింది. అలాగే, స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది పాక్ సర్కార్.

వాళ్లకు న్యాయం చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం

పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్లముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్. కేంద్రం ఆ అర్థంలోనే ఈ ఆపరేషన్‌కు ఆ పేరు ఖరారు చేసింది. అదీగాక కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి గాంచిన కశ్మీర్‌ లోయలో పహల్గామ్‌ ఉగ్రదాడులతో పాకిస్తాన్‌ రక్తం పారించింది. పాక్‌ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం.

జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ధ్వంసం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా, పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించిన బహవల్పూర్ ఇదే. పాకిస్తాన్ ఐదు ప్రదేశాలపై దాడి చేసినట్లు అంగీకరించింది. వీటిలో మూడు పీఓకేలో, రెండు పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జరిగాయి. భారత దాడిలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైంది.

ఆపరేషన్ సింధూర్‌‌పై ట్రంప్ ప్రకటన..

భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు ట్రంప్ సూచించారు. ఇరు దేశాలు దశాబ్దాలుగా గొడవ పడుతున్నారు, దీనికి త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని తెలిపారు.

ఆపరేషన్ సిందూర్’ పై భారత్ కీలక ప్రకటన

భారత హోం మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ సింధూర్’ పై ప్రకటనలో మొత్తం 9 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మా చర్యలు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాలను ఎంచుకోవడంలో భారతదేశం చాలా సంయమనం పాటించిందని ప్రకటించింది. పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ జాతీయుడు మరణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత చర్య..

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టినట్లు భారత్ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు ఈ మేరకు సందేశం పంపినట్లు తెలిపింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేశాయి

  • భారతదేశ ఆపరేషన్‌పై పాకిస్తాన్ ప్రకటన

    పాకిస్తాన్ డాన్ న్యూస్ నివేదిక ప్రకారం, కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారతదేశం కోట్లి, బహవల్‌పూర్, ముజఫరాబాద్‌లలో క్షిపణి దాడులు నిర్వహించిందని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు.

పహల్గామ్ ప్రతీకారం మొదలైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం దాడి తర్వాత, లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను తదుపరి 48 గంటలు మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్-రాజౌరి ప్రాంతంలోని భింబర్ గాలిలో ఫిరంగి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ దుర్మార్గపు చర్యకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال