Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం


 

  • 47వ కౌంటర్ లో హఠాత్తుగా చెలరేగిన మంటలు
  • భయంతో పరుగులు తీసిన భక్తులు
  • సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని ఓ లడ్డూ కౌంటర్ లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. 47వ కౌంటర్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో, భక్తులు భయంతో కౌంటర్ నుంచి బయటకు పరుగెత్తారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదంలో పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు. 

Previous Post Next Post

نموذج الاتصال