కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కోర్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించిన జడ్చర్ల పోలీసులు


ఈ రోజు తెల్లవారు జామున జడ్చర్లలోని బొడ్రాయి బజార్ ప్రాంతంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రాములు పర్యవేక్షణలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకి మంచి సేవలు అందించే ఉద్దేశంతో కోర్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 33 బైక్‌లు, 1 కార్, 1 ఆటోలను గుర్తించి జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాములు 
మాట్లాడుతూ, జన సమాజంలో భద్రతను పెంపొందించడం, ప్రజలకు చేరువయ్యే దిశగా మరియు నేరాల నివారణకు ఈ తరహా తనిఖీలు ఎంతో అవసరమని, ప్రజలు సహకరించాలని సూచించారు. అలాగే, న్యాయసరైన పత్రాలు మరియు రవాణా నిబంధనలను పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమం ప్రజలలో భద్రతాభావాన్ని పెంపొందించడమే కాకుండా, నేర ప్రవృత్తులను అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని వివరించారు.


ఈ కార్యక్రమంలో DCRB DSP రమణా రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎజాజ్ అహ్మద్, జడ్చర్ల ఇన్స్పెక్టర్ ఆది రెడ్డి, RI MTO కృష్ణయ్య, మహబూబ్ నగర్ రూరల్ సీఐ గాంధీ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال