మహబూబ్నగర్ అయ్యప్ప గుడి చరిత్ర ఏంటి 27 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మహాపడిపూజ

 కఠిన దీక్షతో దైవ సన్నిధికి 


-- పెరుగుతున్న అయ్యప్ప దీక్ష పరులు 

-- భక్తుల సేవలో మహబూబ్ నగర్ ముందంజ 

-- 25వ తేదీన కొండపై మహా పడిపూజ 

-- ఏర్పాట్లు చేస్తున్న అయ్యప్ప సేవా సమాజం 

-- అధ్యక్షులు భగవంతు రావు 

మహబూబ్ నగర్ మన ఉదయం డిసెంబర్ 22: 

హిందూ దేవతలలో ఒకరైన అయ్యప్ప స్వామి దీక్షపరులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మహావిష్ణువు శివుడు సంగమం తో  పుట్టిన అయ్యప్ప స్వామి ప్రపంచంలోనే హరిహర పుత్రుడుగా మణికంఠుడు గా సత్యదేవుడుగా పూజలు అందుకుంటున్నాడు. కేరళ రాష్ట్రంలోని శబరిమలై లో ప్రధాన దేవాలయం ఉంది ప్రతి ఏడాది దేశం నలుమూలల నుండి అయ్యప్ప భక్తులు నిష్ఠ తో కఠోర దీక్ష చేపట్టి 48 రోజులపాటు భక్తిశ్రద్ధలతో మాలధారణ చేస్తున్నారు. కన్నె స్వామి నుండి మొదలుకొని గురుస్వామి వరకు అనేకమంది సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై అయ్యప్ప నామస్మరణ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దైవ సన్నిధి లో  భాగంగా అయ్యప్ప సమాజము అనేక సేవా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ లోఅయ్యప్ప సేవా సమాజం అందరి కంటే ముందు వరుసలో ఉంది. ఈ సమాజం ఆధ్వర్యంలో దేవాలయంలో మాల ధారణ చేసిన స్వాములు నిత్యం 350 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. పాలమూరు కొండపై వెలసిన అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణమై 27వ వార్షికోత్సవ సందర్భంగా మహా పడిపూజ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులు సి ఆర్  భగవంతురావు ఆదివారం మీడియా సమావేశం లో పాల్గొని మాట్లాడారు .మహా పడిపూజ సందర్భంగా 25వ తేదీ బుధవారం నాడు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. ఉదయము ఐదున్నర గంటలకు సుప్రభాత సేవ ఆరు గంటలకు గణపతి నవగ్రహ హోమం, ఆరున్నర గంటలకు నిత్యాభిషేకం, 9:30 గంటలకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం, 10 గంటలకు తూర్పు కమాన్ రామాలయం నుండి కలశ పల్లవి ఊరేగింపు పురవీధుల వెంట ప్రారంభమవుతుందన్నారు.  11 గంటలకు అష్టాభిషేకం మధ్యాహ్నం ఒంటిగంటకు అయ్యప్ప సేవా సమాజంచే అన్నదాన కార్యక్రమం, సాయంత్రం ఏడు గంటలకు  పుష్పాభిషేకం  జరుగుతుందని తెలిపారు. పుష్పాభిషేకము అనంతరం సాయంత్రం ఏడున్నర గంటలకు ఏకశిలా దివ్య పదునెట్టాంబడి  మహా పడి పూజ మంగళహారతి జరుగుతుందన్నారు. పూజకు విచ్చేసిన భక్తులందరి అన్న వితరణ స్వాములకు అల్పాహారం ఉంటుందాన్నారు. ఈ మహా పడిపూజకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ డీకే అరుణ , శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎంపీ జితేందర్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అందరూ హాజరుకానున్నారన్నారు. పూజకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేస్తున్నమన్నారు. అయ్యప్ప భక్తులు అయ్యప్ప కొండ పై జరిగే మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సమాజం కార్యదర్శి గురుస్వామి, జాయింట్ సెక్రెటరీ పంపరాజు గురుస్వామి, మాల్యాద్రి స్వామి , వెంకట్ రెడ్డి స్వామి , సంతోష్ స్వామి..తదితరులు పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال