మహారాజు కృష్ణరాజు వడయార్ మైసూర్ పాక్ రుచి కేవలం అంతఃపురానికే పరిమితం కాకుండా ప్రజలందరికీ తెలియాలని తమ కోట " ప్యాలెస్ కు సమీపంలో " ఒక దుకాణం ఏర్పాటు చేయమని మడప్పకు సూచించారు. అలా రాజకుటుంబ ప్రధాన చెఫ్ మడప్ప 1935లో మొదలుపెట్టిన షాపే ఫేమస్ " గురు స్వీట్స్ ". వాడయార్లు ఈ స్వీట్ ను బ్రిటిషర్లకు గిఫ్ట్ గా పంపడం , వాళ్లకూ ఇది నచ్చడంతో మైసూర్ పాక్కు మరింత పాపులర్ కి వచ్చింది. మైసూర్ పాక్ స్వీట్ జనంలో ఎంతలా పాపులర్ అయిందంటే ఇండియా మొత్తం మీద ఈ స్వీట్ అమ్మని ఊరే కనపడదు....
మైసూర్ పాక్ తయారీకి పదార్థాలు చాలా తక్కువ. పంచదార, నీళ్లు సమాన మోతాదు లో కలిపి పాకంలా తయారయ్యేంతవరకు వేడి చేస్తారు. పాకం సరైన స్థితికి చేరుకున్నాక దానిలో శనగపిండి కలిపి, పైన యాలకుల పొడి వేసి నెయ్యి రాసిన ప్లేట్లో పోసి కావలసిన షేప్ లో ముక్కలుగా కట్ చేస్తారు. అంతే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. ఈ మధ్య కాలంలో మైసూర్ పాక్ లో తమ తమ టేస్ట్ కు తగ్గట్టుగా రకరకాల ఫ్లేవర్లు కలుపుతున్నారు.
మైసూర్ ప్యాలెస్ దగ్గర్లోని దేవరాజ మార్కెట్లో సయ్యాజి రావు రోడ్ లో ఈ గురు స్వీట్ షావు ఉంటుంది. ఉదయం నుండి రాత్రి 10 వరకూ తెరిచి ఉంచే ఈ షాప్ ముందు కస్టమర్ల తో పెద్ద క్యూలైనే ఉంటుంది. అలాగే మైసూర్ కు వచ్చే టూరిస్టులు మైసూర్ ప్యాలెస్ తో పాటు గురు స్వీట్స్ షాప్ ను కూడా సందర్శించి మైసూర్ పాక్ ను కొనుక్కుని వెళుతూ ఉంటారు. "మైసూర్ పాక్ లో మైసూర్ ఉంటుందా " అనే ఓ సరదా సినిమా డైలాగ్ బాగా పాపులర్. అది నిజమే కానీ " మైసూర్ పాక్ మాత్రం మైసూర్ లోనే పుట్టిందనేది "అసలు వాస్తవం.
Tags
News@jcl