ఓ భగవంతుడా, ఆసుపత్రికి వెళ్లే అవసరం రాకుండా చూడు!
పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కే
సమస్య లేకుండా చూడు!
కోర్టు మెట్లెక్కవలసిన
కేసులు రాకుండా చూడు!
రాజకీయ నాయకుడు దగ్గరకువెళ్లే పని లేకుండా చూడు !
మంత్రిగారిని కలవవలసిన
ముప్పేమీ రాకుండా చూడు!
రౌడీతో రాజీ పడవలసిన
రోజు రాకుండా చూడు!
అత్యాశలతో దేవుడికి ముడుపులు కట్టవలసిన కోరిక కలగకుండా చూడు!
పూజలు,హోమాలు లోక కళ్యాణానికి తప్ప.. చేసిన
పాపాల కోసం చేయకుండా చూడు!
యజ్ఞాలు, హోమాలు చేయవలసిన స్వార్థ ధ్యేయాలు లేకుండా చూడు!
బాబాల దగ్గర మోసపోవలసినంత అమాయకత్వం లేకుండా చూడు!
స్వాముల దగ్గరకు పోవలసినంత అజ్ఞానం లేకుండా చూడు!
మొబైల్ మోసాల మాయలో పడనంత
మెలుకువ ప్రాదించు!
సైబర్ నేరగాళ్ల వలలో పడనంత ఆలోచన అందించు!
విద్యుక్తధర్మం నిర్వర్తించే
వివేకాన్ని అనుగ్రహించు!
పర్యావరణాన్ని రక్షించే
పట్టుదల ప్రసాదించు!
వసుదైక కుటుంబం కాంక్షించే విశాలహృదయం ప్రసాదించు!
సమస్యలను ఎదుర్కొనే
సంయమనం అనుగ్రహించు!
సంఘజీవిగా మెలిగే
సంస్కారాన్ని ప్రసాదించు!
విలువలు వెలిగించే
వ్యక్తిత్వాన్ని అనుగ్రహించు!
న్యాయాన్ని నిలబెట్టే
నిబద్ధత ప్రసాదించు!
నా అనుకునే వారికేవారికీ ఆపద,ప్రమాదాలు కలుగకుండా దీవించు..వారికి అనుకోని ఆపదే వస్తే..నాతో వారికి మేలు జరిగెట్టు నన్ను అనుగ్రహించు.
అన్నార్తులకు అన్నంపెట్టే
అవకాశం అనుగ్రహించు!
అభాగ్యులను ఆదుకునే
సమర్ధత సమకూర్చు!
అక్రమాలను అడ్డుకునే
సంకల్పం ప్రసాదించు!
ఆఖరిక్షణం వరకు నీ నామ స్మరణ జరిపే వరం ప్రసాదించు!
ప్రతీరోజూ సూర్యనమస్కారాలు చేసుకునే ఆరోగ్యాన్ని ప్రసాదించు.
అనునిత్యం భగవన్నామ స్మరణ చేసుకునే భాగ్యాన్ని కలిగించు.
ప్రతినిత్యం భరతమాత ను ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ,కీర్తిస్తూ బ్రతికే మహాప్రసాదాన్ని అందించు
ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా
ఎగిరిపోయే జీవితం అనుగ్రహించు !!!
🙏 🙏🙏🙏 🙏
ఇవే నా Modern కోరికలు...శుభోదయం మీ రవీందర్ గజవెళ్లి !!