చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించిన
ఓ వ్యక్తి అంత్యక్రియలకు ముందు స్పృహలోకి వచ్చిన ఘటన రాజస్థాన్లోని జైపూర్ జిల్లా ఝున్తునూలో వెలుగుచూసింది... అయినా అతడు కొద్ది గంటలకే ప్రాణాలు కోల్పోయాడు...ఈ ఘటనలో ముగ్గురు వైద్యులను అధికారులు సస్పెండ్ చేశారు... పోలీ సుల కథనం ప్రకారం..25ఏళ్ళ రోహితాశ్ కుమార్ బాధిరుడు ఐన అతడికిఎవరు లేని ఏకాకి కుటుంబం లేదు. కొన్నేళ్లుగా ఒక షెల్టర్ హోమ్లో ఉంటున్నాడు. గురువారం అతడు అపస్మారక స్థితిలో కి జారిపోయాడు. వెంటనే అతడిని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించి, అత్యవసర వార్డులో చికిత్స అందించారు. వైద్యానికి స్పందించడం లేదని మొదట చెప్పిన
వైద్యులు.. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణించినట్లు ప్రకటిం చారు. అతడి దేహాన్ని రెండు గంటలపాటు మార్చురీలో ఉంచారు. పోలీసుల పంచనామా అనంతరం దేహాన్ని స్థానిక శ్మశానానికి తరలిం చారు. చితిపై ఉంచాక, రోహితాశ్ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడాన్ని కొందరు గమనించారు. వెంటనే అంబులెన్స్ రప్పించి, అతడిని తిరిగి బీడీకే ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం అతడిని జైపుర్కు తరలిస్తుం డగా, దారిలో మృతి చెందాడు. బాధితుడికి సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ముఖ్య వైద్య అధికారి తో సహా ముగ్గురు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. జైపూర్ లో ఇది సంచలనం రేగింది