ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు* మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆక్షేపణ*


 *జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి టీడీపీ హితవు* 

 *టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆక్షేపణ* 

 *టిటిడి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని మరవొద్దు* 

 *తిరుపతి సౌకర్యాల విషయంలో పెద్దాయనను లాగడం మంచిది కాదు* 

 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై ఫిర్యాదు* 

 *ప్రాంతాల గురించి అన్వేషణ మంచి సాంప్రదాయం కాదు* 

 *ఘర్షణకు తావు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాస్తున్నాను అంటూ బక్కని వెల్లడి* 

తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మధ్యలో లాగడం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి తగదని టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు హితవు పలికారు. మంగళవారం బక్కని నర్సింలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టీటీడీ లేఖల అంశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలపై ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖను పంపిస్తూ దాని ప్రతిని మీడియాకు విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని దీనిని అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన స్థాయికి మించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం తగదని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు "ఒక కన్నును పోడుచుకున్నారా? తెలంగాణ పై చిన్ప చూపెందుకు? "అంటూ శ్రీవారి దర్శనం, వసతి గదులు కోసం తెలంగాణ ప్రజా ప్రతినిదుల నుండి లేఖలను తీసుకోకపోవడం బాదాకరమని, ఎపి నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా యాదగిరి గుట్ట, భద్రాద్రి దేవాలయాలలో ఆంద్రప్రదేశ్ ముఖ్యలకు దర్శనాలు కల్పిస్తున్నట్లు అనిరుద్ రెడ్డి తెలిపారని వివరించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 కళ్లు అనే సిద్ధాంతాంలో గోప్ప పవిత్రమైన అర్ధం ఉందని గాయత్రి మంత్రంలో ఏడమ కన్ను యందు ఉన్న సపలత అనే గ్రంది ఉంటుంది.. ఈ గ్రంది ద్వారా పరాక్రమము అనే శక్తి జాగృతం అవుతుందని, కుడి కన్ను యందు ఉన్న విశ్వ అనే గ్రంది ద్వారా పాలన అనే శక్తి జాగృతం అవుతుందనీ చంద్రబాబు నాయుడు రేండు రాష్టాలు ముఖ్యమంత్రిగా సుదీర్గంగా పాలించినందు వల్ల రేండు కళ్ల సిద్ధాంతం చెప్పడం జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను కోరునది ఏమనగా అంటూ లేఖను సంధించారు... మీ పార్టీ గౌరవ శాసన సభ్యులు అనిరూద్ రెడ్డి తన స్థాయిని మించి, ఉమ్మడి రాష్ట్రంలో మనందరికి ముఖ్యమంత్రిగా సేవలందించిన పెద్దాయన గురించి అమర్యాదగా మాట్లాడడం, అందులో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వ్యాపారులు దైవ దర్శానాల గురించి ప్రస్తావించడం సహించ రానిదని విమర్శించారు. ప్రాంతాల గురించి మాట్లాడే ముందు ఏవరు ఏ ప్రాంతం నుండి, ఏ ప్రాంతానికి వలసలు వచ్చారో పెద్దలు సురవరం ప్రతాప్ రెడ్డి రచించిన పుస్తకాలు చదివి ఒక నిర్ణయానికి రావడం మంచిదని హితబోధ చేశారు.

హైదరాబాద్ ను స్వాతంత్ర్యం వచ్చే వరకు పాలించిన నిజాం పూర్వికులు టర్కీ దేశస్తులు కాగా గోల్కోండ కోటను ఏలిన ఖులీ ఖుతబ్ షాలు అరబ్ దేశస్తులు అన్నది మరచి పోరాదనీ, తిరుమల ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అక్కడ రాజకీయాలు మాట్లాడడం మంచి సాంప్రదాయం కాదన్నారు.

తెలంగాణ ప్రజా ప్రతినిదులు ఉత్తరాలే కాదు, ఆంద్రప్రదేశ్ ప్రజా ప్రతినిదుల ఉత్తరాలు సహితం స్వీకరించడం లేదనీ దీనికి ముఖ్య కారణం సాదారణ భక్తుల సౌకర్యార్ధం టి.టి.డి తీసుకున్న నిర్ణయంగా ఆయన వివరించారు.

తెలంగాణ శాసన సభాపతి గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన సందర్భం గుర్తుంచుకోవడం సముచితం అనీ బక్కని పేర్కొన్నారు. టి.టి.డి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుని లాగడం బావ్యం కాదనీ, గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని సమస్యల వలన టి.టి.డి సాదారణ ప్రజలకు దగ్గరగా చేర్చాడానికి టి.టి.డి చేస్తున్న కృషికి మనం సహకరించాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నేను ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న నాడు ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహబుబ్ నగర్ జిల్లా టిడిపి సాంకేతిక నిపుణుల విబాగం అధ్యక్షునిగా పని చేసింది మరిచి పోరాదని వివరించారు. ఇది ప్రజా స్వామ్య దేశం విదేశాలలో వ్యాపారులు, ఉద్యోగాలు విద్యను అభ్యసిస్తున్న మనం ప్రాంతాల గురించి అన్వేషణ మంచి సాంప్రదాయం కాదని శాసన సభ్యుడికీ హితవు చెప్పాలని ఘర్షణకు తావు లేకుండా నేను మీకు ఉత్తరం వ్రాయండం జరిగిందని నేను టి.టి.డి బోర్డు సభ్యునిగా ఉన్న నాడు సహితం సామాన్య భక్తులకు ఇబ్బంది కల్గించలేదని లేఖలో ప్రస్తావించారు.



అనాడు కోండపై హెల్త్ వర్కర్లు స్ట్రైక్ చేస్తున్న సందర్భంలో.. నేను శాసన సభ్యునిగా, టిటిడి బోర్డు సభ్యునిగా అనాటి జెఇఓ గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం, ఐ.ఎ.ఎస్ గారు కలిసి తిరుమలలో వీదులు, మోజీలు శుభ్రం చేయడం జరిగింది. కావున దేవ దేవుని దగ్గర అందరం సమానమే అనే భావన మరువరాదని కోరుతున్నాను అంటూ మాజీ ఎమ్మెల్యే బక్కని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను పంపించారు.. *కేపి*

Previous Post Next Post

نموذج الاتصال