వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల ఎస్సె రవి లంచం తీసుకుంటూ ఏసీబీ
వలకు చిక్కాడు. కేసును నీరు కార్చేందుకు ఓ వ్యక్తి వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కు చెందిన డేరంగుల వెంకటేష్ ఈనెల 17న రాళ్లు పగలకొట్టడానికి వినియోగించే మందు గుండు సామాగ్రిలను నిల్వ చేయగా వెల్దండ పోలీస్ పట్టుకున్నారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించాడు. ఎస్సై సూచనతో ఒప్పందంలో బాధితుడు వెంకటేష్ కల్వకుర్తి పట్టణం కు చెందిన మధ్య వర్ది అంబులెన్స్ డ్రైవర్ విక్రమ్ కు రూ.50 వేలు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అదే సమయంలో వెల్దండ ఎస్సై రవి ని అరెస్ట్ చేశారు.