పాలమూరులో కరువు ఛాయలు అలుముకున్నాయి.
పంటలు వేసుకున్న రైతన్న ఆశలు అడియాసలయ్యాయి. వేసవి ఎండలు మండుతుండడం ఒకవైపు.... భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండిన బోర్లు మరోవైపు రైతన్నను అతలాకుతలం చేశాయి. హన్వాడ మండలం పల్లెమోనికాలనీ గ్రామ సమీపంలో బోర్లు ఎండిపోయి పంటకు నీరు లేక వెంకట్రాములు గౌడ్ రైతు పొలంలో వేసుకున్న వరి పంట గొర్రెలకు మేతగా మారింది.
హృదయ విధారకమైన ఇలాంటి పరిస్థితి రైతన్నకు దాపురించడం అందరి మదిని కదిలిస్తోంది. మరికొన్నిచోట్ల వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కొని పంటలకు తడి పారించుకుంటూ కాపాడుకుంటున్న దీనమైన స్థితి కనిపిస్తోంది. ఇంతటి కరువు కాటకాలు రైతన్నను వెంటాడుతుంటే రైతుకు భరోసా ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో తమ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టడం లేదు. కరువు పై రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండడం గమనార్హం.
Tags
News@jcl