
చటో గ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ప్రస్తుతం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 2వ రోజు ఆటలో భాగంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. స్లిప్‌లో వద్దకు వచ్చిన ఒక సులువైన క్యాచ్ ను ముగ్గురు బంగ్లాదేశ్ ఫీల్డర్లు జారవిడిచారు. క్యాచ్ లు మిస్ చేయడం సహజమే అయినా.. ఈ క్యాచ్ మాత్రం నవ్వు తెప్పిస్తుంది. నన్ను ఎంత పట్టుకున్నా మీకు దొరకనంటూ బంతి ముగ్గురిని మాయ చేసింది.
బంగ్లాదేశ్ పేసర్ ఖలీద్ అహ్మద్ వేసిన ఆఫ్ స్టంప్ డెలివరీని కమిందు మెండిస్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లిప్ వద్దకు వెళ్ళింది. అక్కడే ఉన్న కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో చేతిలోకి వచ్చిన ఈజీ క్యాచ్ ను అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే వెంటనే తేరుకున్న షాహదత్ హొస్సే.. సెకండ్ స్లిప్ లో ఆ క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అతను కూడా జారవిడడంతో థర్డ్ స్లిప్ లో ఉన్న జకీర్ హసన్ వైపు వెళ్లగా.. అతను కూడా ఈ క్యాచ్ ను పట్టలేకపోయాడు. ఒక్కసారిగా ముగ్గురు ఫీల్డర్లు బంతిని మిస్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఈ క్యాచ్ బాగా వైరల్ అవుతుంది. లంక ఇన్నింగ్స్ 121 ఓవర్ చివరి బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది.
also read : బాబర్ పనికిరాడు.. కెప్టెన్సీకి అతడే సరైనోడు: షాహిద్ అఫ్రిది
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక ఈ మ్యాచ్ పై పట్టు బిగిస్తుంది. మొదటి బ్యాటింగ్ చేసిన లంక జట్టు 531 పరుగులకు ఆలౌటైంది. కమిందు మెండిస్ (92), ధనంజయ డిసిల్వా (70), దినేష్ చండిమాల్ (59), కరుణ రత్నే (86), మదుష్కా (57) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 178 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాకీర్ హసన్ 54 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అసిత ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టాడు.
Juggling act ft. Bangladesh team. 🤹♂️pic.twitter.com/y7XC5SYAN5
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2024
from V6 Velugu https://ift.tt/6XJkmVA
via IFTTT