పెరుగుతున్న జంపింగ్ జిలానీలు...

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న జంపింగ్ జిలానీలు...



జడ్చర్లలో మారుతున్న రాజకీయం కార్లు వీడి కాంగ్రెస్లో కలవబోతున్న కౌన్సిలర్లు.

రేపు మా పో మారడం పక్క... కాలనీలలో పలు సమస్యలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు కౌన్సిలర్లు ధైర్యంగా కాలనీలలో తిరగలేని పరిస్థితి నెలకొంది.

అందులోనూ ఎలక్షన్లో సీజన్ కావడంతో కౌన్సిలర్లకు గొంతులో వెలక్కాయ ఇరుక్కున్నట్లు అయింది.

తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మున్సిపల్ చైర్మన్ భర్త దొరపల్లి రవీందర్ పై తీవ్ర ఆర్థిక ఆరోపణలు చేశారు ఆ తర్వాత ఆ ప్రస్తావన లేకుండా పోయింది. నాలుగు సంవత్సరాలు దాటితే తప్ప అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో కౌన్సిలర్లను కాంగ్రెస్ లోకి చేర్చుకొని జడ్చర్ల మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు వేదికగా తమతో కలిసి వచ్చే పాత కాంగ్రెస్ నాయకులు ఎవరు brs లో కౌన్సిలర్లుగా గెలిచారో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వారం పది రోజులలో నాలుగు నుండి 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

Brs పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి విపరీతమైన వలసలు ఉండేవి ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ మారింది. టిఆర్ఎస్ పార్టీలో నుండి గెలిచినా కూడా అభివృద్ధి ధ్యేయంగా పార్టీ మారుతున్నామని చెప్పినా వెనక మతల వేరే ఉంది అని గుసగుసలు..

గత ప్రభుత్వంలో వారు చేసిన తప్పులు ఇప్పుడు మెడకు చుట్టుకొని ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందో అన్న భయం నాయకులను వెంటాడుతుంది.

తాజాగా జడ్చర్లలో పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి టచ్లోకి వెళ్లారు.

రేపు మా పో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఎలాగూ స్థానిక సంస్థ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డి గెలుపు ఈ విధంగా నైనా ఈజీగా చేసుకోవాలని కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గేటు ఎత్తాం brs ఖాళీ అవుతుందని అన్నారు.

ఆ మరునాడు పలువురు brs ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఇదే వరస జడ్చర్ల మున్సిపాలిటీలో జరగబోతుందా..?


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow