డ్రగ్స్ బాబోయ్ డ్రగ్స్... ఇదే ఇప్పుడు డేంజరస్ వెపన్

 తెలంగాణ లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు



-- హైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు


-- ఢిల్లీ నుండి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాప్స్


-- ఆరు హోల్ సేల్ మెఫికల్ షాపులపై కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు..


-- సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 లక్షల స్టాక్ సీజ్..


-- ఉప్పల్ లో శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్ లో 3.52 లక్షల స్టాక్ సీజ్..


-- సుల్తాన్ బజార్ లో శ్రీ పరస్ మెడికల్ ఏజెన్సీస్ లో 9 లక్షల స్టాక్ సీజ్..


-- నాగోల్ లోని శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లో 14 లక్షల స్టాక్ సీజ్..


-- కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ లో 2 .7 లక్షల స్టాక్ సీజ్..


-- కాచిగూడ లోని శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో 16 లక్షల స్టాక్ సీజ్ .


-- మెడికల్ షాప్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు..


-- సోదాలు నిర్వహించి స్టాక్ సీజ్ చేసిన అధికారులకు ధన్యవాదాలు 

-- తెలంగాణ లోని మొత్తం మందుల షాపులు తనిఖీ చేయాలని విజ్ఞప్తి.

-- ఫార్మసిస్టు లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులు స్వీట్స్ చేయాలి

-- తెలంగాణ ఫార్మసిస్ట్ అనుబంధ సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ గంప విజయకుమార్


హైదరాబాద్ ప్రతినిధి మన ఉదయం మార్చ్ 20 : 

హైదరాబాద్ అడ్డాగా మందుల షాపుల బాగోతం మరోసారి బట్టబయలు అయ్యింది మందుల షాపులు తనిఖీ చేసిన అధికారులకు అడ్డంగా దొరికిపోయిన మందుల మాఫియా నాయకులు . వివరాలలోకి వెళితే హైద్రాబాద్ కు చెందిన కొందరు మందుల షాపు యజమానులు ఢిల్లీ నుండి జీరో బిల్ లో మందులు ఇంజక్షన్లు పెద్ద ఎత్తున తెచ్చి 40 శాతం డిస్కౌంట్కు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ కు చెందిన ఆరు మందుల షాపుల్లో అధికారులు తనిఖీ చేసి పెద్ద ఎత్తున 51 లక్షల రూపాయల మందులను సీజ్ చేశారు. ఈ ఆరు మందుల షాపు ల వివరాలు ఇలా ఉన్నాయి సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 లక్షల స్టాక్ సీజ్ చేయగా ,

ఉప్పల్ లో శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్ లో 3.52 లక్షల స్టాక్ డ్రగ్స్ అధికారులు సీజ్ చేశారు. సుల్తాన్ బజార్ లో శ్రీ పరస్ మెడికల్ ఏజెన్సీస్ లో 9 లక్షల స్టాక్ సీజ్ చేయగా ,నాగోల్ లోని శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లో 14 లక్షల స్టాక్ సీజ్ చేసిన డ్రగ్స్ అధికారులు. 

కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ లో 2 .7 లక్షల స్టాక్ సీజ్ చేయగా ,

కాచిగూడ లోని శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో 16 లక్షల స్టాక్ సీజ్ చేసిన డ్రగ్స్ అధికారులు .

మెడికల్ షాప్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారుల కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ ఫార్మసిస్ట్ అనుబంధ సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గంప విజయకుమార్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ లోని అన్ని మందుల షాపులు తనిఖీ లు నిర్వహించాలని అధికారులను కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఫార్మసిస్ట్ సర్టిఫికెట్లతో మందుల షాపుల లైసెన్సులు పొంది షాపు యజమానులు మందుల మాఫియా నడుపుతూ కోట్ల రూపాయల కొల్లగొడుతున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మందుల షాపు లలో తనిఖీలు నిర్వహించాలని , ఫార్మసిస్టు లేకుండా యాంటీబయాటిక్స్ స్థిరాయిడ్స్ మత్తు మందులు మందులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు . ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్లను నియమించాలని , ఫార్మసీ ఇన్స్పెక్టర్ల నియమించాలని అయన సూచించారు. తెలంగాణలో ఉన్న అన్ని మందుల షాపులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. బయోమెట్రిక్ విధానంతో ప్రతి మందుల షాపు ఫార్మసిస్ట్ థంబ్ ఇంప్రెషన్ తో తెరవాలని అయన తెలిపారు.

తెలంగాణ లో డ్రగ్స్ అధికారులు ఫార్మసిస్ట్ అఫడవిట్ తో మందుల షాపు లైసెన్సు లు జారిచేస్తు ఆ పై మందుల షాపులు తనిఖీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. మందుల షాపు లైసెన్స్ కు వాళ్ళు ఇచ్చే మామ్మ్ములకు అలవాటు పడి చట్టాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. బ్లాక్ ఫంగస్, కిడ్నీ ఫెయిల్యూర్స్, నూతన రోగాలతో బాధితులు చనిపోవడానికి డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు పరోక్షంగా కారణమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మందుల షాపుల లైసెన్సులలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి తప్పు చేస్తున్న ఫార్మసిస్టులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేము విద్యానందించేటప్పుడు విద్యను అమ్ముకోవద్దు తాకట్టు పెట్టొద్దని ఫార్మసిస్టులకు చెప్తున్నామని కానీ వాళ్ళు మళ్ళీ అదే విధంగా మార్కెట్ లో సర్టిఫికేట్ లు అద్దెలకిస్తూ ఇంకో ఉద్యగం చేస్తూ ప్రత్యక్షంగా ప్రజల ప్రాణాలు వివిధ రోగాల బారిన పడి హరించడానికి కారణమవుతున్నారన్నారు. 

ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము మాకు ఉన్న డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్, ఫార్మసీ యాక్ట్ చుట్టాలను 

కచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆయన కోరారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow