బీఆర్ఎస్ పార్టీలో మాకు విలువలేదు..! పొద్దున అలా - సాయంత్రం ఇలా మాట మార్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్ కానుగు అనంతయ్య

 బీఆర్ఎస్ పార్టీలో మాకు విలువలేదు..! 



 పొద్దున అలా - సాయంత్రం ఇలా 



 మాట మార్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్ కానుగు అనంతయ్య 


ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పుణ్యమా అని షాద్నగర్ పట్టణంలో చిత్ర విచిత్ర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. పొద్దున కాంగ్రెస్ పార్టీలో చేరిన 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సాయంత్రానికి కాంగ్రెస్లో చేరి కొత్త లోకానికి వచ్చినట్టుందని ప్రగల్బాలు పలికి, తీరా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరి మనసు ఒప్పుకోవడం లేదంటూ మరో ప్రకటన చేశారు. టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో రాజకీయాల్లో ఆయన నవ్వుల పాలయ్యారు. రాజకీయ అపరిపక్వత విధానాలతో అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇలా గంటల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించడంతో కానుగు అనంతయ్య అబాసుపాలు అయ్యారు. టిఆర్ఎస్ పార్టీలో పదవి ఎప్పుడైపోతుందా అని బాధపడినట్లు ఎమ్మెల్యే శంకర్ ఏర్పాటుచేసిన సభలో కానుగు అనంతయ్య ప్రసంగించడం గమనార్హం. తీరా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాక మరోలా మాట మార్చడం మరో విశేషం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కానుగు అనంతయ్య వ్యవహారం ఇరు సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు ఇరు పార్టీల నాయకులు వైరల్ చేస్తున్నారు. వీడియోలో ఏం మాట్లాడారో మీరు చూడవచ్చు.. కేపీ

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow