ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌కు త్వరలోనే గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్!

 ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌కు త్వరలోనే గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్!

   




 హౌసింగ్‌‌‌‌‌‌‌‌లో డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై 450 మంది ఆఫీసర్లు 



కసరత్తు చేస్తున్న హౌసింగ్ అధికారులు 

   

 ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్స్‌‌‌‌‌‌‌‌పై స్టడీ 

   

 ఈ నెలాఖరు కల్లా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌ ‌‌‌‌‌‌‌అందజేసే అవకాశం 

   


హైదరాబాద్ :  ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. ఈ పథకం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను రూపొందించే పనిలో హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెలాఖరు కల్లా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వానికి అందచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్స్‌‌‌‌‌‌‌‌పై అధికారులు స్టడీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఎంతో కీలకమైంది. 100 శాతం సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది.


డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్‌‌‌‌‌‌‌‌ల విషయంలో గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ కార్యకర్తలకు, ఇండ్లు ఉన్నోళ్లకు, ఎమ్మెల్యేల అనుచరులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ లబ్ధిదారుల లిస్టులో చోటు దక్కిందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గత అనుభవాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇండ్లు లేని పేదలను గుర్తించి, ఎలాంటి అవకతవకలు జరగకుండా స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

 💐డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై వెళ్లినోళ్లు తిరిగి హౌసింగ్‌‌‌‌‌‌‌‌కు! 

Previous Post Next Post

نموذج الاتصال