నవాబుపెట్ మండలంలో జోరుగా సాగుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం
భారీగా హాజరైన ప్రజలు.బైక్ ర్యాలీతో స్వాగతం.
Dt:20-11-2023
నవాబుపేట మండలంలోని మల్లారెడ్డిపల్లి, ఇప్పటూర్,రుక్కంపల్లి,యన్మన్ గండ్ల,లోకిరేవు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుసుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే పల్లెల్లో పండగ వాతావరణం వచ్చిందని,త్రాగునీరు,సాగునీరు,కరెంటు ఎటువంటి అంతరాయం లేకుండా అందుతుందని,రైతులకు రైతుబందు,రైతు భీమా,రుణమాఫీ,రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే చెందుతుందని,అందుకే పనిచేసే ప్రభుత్వానికే మద్దతు పలికి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
Tags
News@jcl

