ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై పవన్ రియాక్షన్

ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బాధితులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని స్పష్టం చేశారు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పలరాజుని ఆదేశించారు సీఎం జగన్. ఇక, బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని అధికారులకు సూచించారు.. Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై పవన్ రియాక్షన్
అమరావతి: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) స్పందించారు. ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు.. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీటిపై ఆధారపడ్డ మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలని.. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి, పటిష్ట చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow