*నిజామాబాద్ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య?*
నిజామాబాద్:నవంబర్ 19
నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్ నిజామాబాద్ పట్టణంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్న కన్నయ్య ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. ఆది గమనించిన కుటుంబసభ్యులు ఆయన ను ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కాగా, కన్నయ్యగౌడ్ మొబైల్‌ను దుండగులు హ్యాక్ చేసి బెదిరించారని, ఆయనకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు పంపి వేధింపులకు గురిచేశారని పోలీసులు తెలిపారు. దీంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.
నిజామాబాద్ అర్భన్ స్థానం నుంచి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరఫున బరిలో నిలిచారు....
Tags
News@jcl
